Amazon flipkart sale: ఐఫోన్ లవర్స్‌కి పండగ లాంటి వార్త.. నమ్మశక్యంకాని డిస్కౌంట్ ఆఫర్లు.. లక్కీ ఛాన్స్..

ABN , First Publish Date - 2022-09-19T18:13:45+05:30 IST

‘మొబైల్స్ నందు ఐఫోన్ క్రేజే వేరయా’ అని వర్ణించినా ఏమాత్రం అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉండే ఆదరణ అలాంటిది మరి.

Amazon flipkart sale: ఐఫోన్ లవర్స్‌కి పండగ లాంటి వార్త.. నమ్మశక్యంకాని డిస్కౌంట్ ఆఫర్లు.. లక్కీ ఛాన్స్..

ముంబై: ‘మొబైల్స్ నందు ఐఫోన్ క్రేజే వేరయా’ అని వర్ణించినా ఏమాత్రం అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉండే ఆదరణ అలాంటిది మరి. కొత్త సిరీస్ ఐఫోన్లు వచ్చాయంటే వాటిని దక్కించుకునేందుకు ఐఫోన్ ప్రియులు పడే తపన అంతాఇంతా కాదు. తెల్లవారకముందు నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాచి మరీ ఫోన్లు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అంతటి గొప్ప ఆదరణ కలిగిన ఫోన్లపై భారతీయ ఐఫోన్ ప్రియులకు నమ్మశక్యంకాని గుడ్‌న్యూస్ వచ్చింది. ఐఫోన్11, ఐఫోన్12, ఐఫోన్13లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ-కామర్స్ దిగ్గజాలు సిద్ధమయ్యాయి. రూ.40 వేల కంటే తక్కువ రేటుకే ఐఫోన్ 12(iphone) దక్కించుకునే సువర్ణావకాశం కస్టమర్ల కోసం వేచిచూస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్(Amazon Great India Festival sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్(Flipkart bigbillion days) ఇందుకు వేదికవనున్నాయి.


ప్రస్తుతం బేస్ వేరియెంట్ 64జీబీ స్టోరేజీ ఐఫోన్ 12 ధర అమెజాన్‌పై రూ.59,999, 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.64,900గా ఉన్నాయి. అయితే అమెజాన్ భారీ తగ్గింపు ధరతో వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అమెజాన్ అఫిషియల్పో స్టర్ ప్రకారం.. ఐఫోన్ 12 రిటైల్ ధర రూ.40 వేల కంటే తక్కువగానే ఉండనుంది. ఎస్‌బీఐ కార్డు ఉన్నవారు అనదంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్టు సోమవారం ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ‘మ్యాడ్ మైండ్ బ్లోయిండ్ అమెజాన్ డీల్’ పేరిట అమెజాన్‌ ఐఫోన్12పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో తొలిసారి ఐఫోన్ కొనాలనుకుంటున్నవారు ఐఫోన్ కొనుక్కునేందుకు చక్కటి అవకాశం దక్కనుంది. అయితే ధరకు ఇందుకు సంబంధించి సంపూర్ణ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రెండుమూడు రోజుల్లో మరిన్ని సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఐఫోన్ 14 సిరీస్(iphone14) విడుదలయ్యాక ఐఫోన్ 12(iphone12) ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.





ఫ్లిప్‌కార్ట్‌పైనా అదిరిపోయే ఆఫర్లు..

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్(Flipkart) బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్11, ఐఫోన్12, ఐఫోన్13లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు కస్టమర్లను ఆకర్షించనున్నాయి. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. ఐఫోన్11 పాత ఫోనే అయినప్పటికీ రూ.30 వేల లోపు దక్కించుకునే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌పై 64జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.30 వేలుగా ఉంది. అయితే పాత ఫోన్ ఎక్స్చేంజీపై రూ.19 వేలకే కొత్త ఫోన్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 12 ధర ప్రస్తుతం రూ.64,900 (128జీబీ) గా ఉండగా.. పాత ఫోన్ ఎక్స్చేంజీతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులకు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. మరోవైపు ఐఫోన్13, ఐఫోన్14పై కూడా భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


64జీబీ స్టోరేజీ ఫోన్ 2022లో డిమాండ్‌కు తగ్గుట్టు లభించకపోవచ్చు. ఎందుకంటే ఈ స్టోరేజీ ఆప్షన్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని యాపిల్ కంపెనీ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ సేల్‌లో వేర్వేరు కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై బ్రహ్మాండమైన డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్చ్సేంజీ ఆఫర్లతో కలిపి ఐఫోన్12(128 జీబీ) ధర రూ.30 వేలకు కూడా దక్కే అవకాశం ఉంది.


పాత ఫోన్లు అని సందేహమా?

ఐఫోన్12 యూజర్లకు సౌకర్యవంతంగానే ఉంటుంది. అయితే రెండేళ్లు లేదా ఆ తర్వాత కొత్త ఐవోఎస్ వెర్షన్‌ను రిసివ్ చేసుకోవడం ఆగిపోనుంది. మిగతా విషయాల్లో ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అన్ని కొత్త ఐఫోన్లకు మాదిరిగానే 5జీ, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరాలు, మాగ్‌సేఫ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అన్ని లభించనున్నాయి. ఒకవేళ ఐఫోన్ 12 వద్దులే అనుకుంటే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ సమయంలో ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. వాటిపై కూడా ఓ లుక్కేయండి.


Updated Date - 2022-09-19T18:13:45+05:30 IST