Rishi Sunak: నేను కోల్పోయేది ఏమీ లేదు! అందుకే.. చివరి వరకూ.. రిషి సునాక్ వైరల్ టీట్..

ABN , First Publish Date - 2022-08-22T05:22:21+05:30 IST

ఈ ఇమేజ్ సాయంతోనే రిషి తనలోని పోరాటపటిమను మనుసుల్లోకి నాటుకుపోయేలా ప్రదర్శించారు.

Rishi Sunak: నేను కోల్పోయేది ఏమీ లేదు! అందుకే.. చివరి వరకూ.. రిషి సునాక్ వైరల్ టీట్..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) కూడా ఈ పోటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే.. ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌దే(Lizz Truss) విజయమని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయి. పార్టీ నేతల్లో చాలా మంది ఆమెకే మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ సర్వేల్లో తేలింది. గెలిచే అవకాశాలు తక్కువగా ఉండటంతో రిషికి అండర్‌డాగ్(Underdog) అన్న ముద్రపడింది. పోటీలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారిని ఈ పేరుతో పిలుస్తారు. 


అయితే.. ఈ ఇమేజ్ సాయంతోనే రిషి తనలోని పోరాటపటిమను మనుసుల్లోకి నాటుకుపోయేలా ప్రదర్శించారు. చివరి కంటా పోరాడుతానంటూ ట్వీట్ చేశారు. దానితో పాటూ ఓ వీడియోను చూడా జత చేశారు. ‘‘అండర్‌డాగ్స్ కోల్పోయేదేం లేదని అంటారు. అందుకే ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అండర్‌డాగ్స్ చివరికంటా పోరాడుతారు.’’ అన్న వాక్యాలు రిషి ప్రచారానికి సంబంధించిన వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించాయి. ఇదే వీడియోను ఆయన షేర్ చేశారు. 


ఇదిలా ఉంటే.. ఇప్పటికే కన్సర్వేటివ్ సభ్యుల్లో అత్యంత సీనియర్ నేత మైఖేల్ గోవ్ ఇటీవలే రిషి మద్దతుగా నిలిచారు. తన ఓటు రిషికేనని స్పష్టం చేశారు. లిజ్ ట్రస్ చెబుతున్న ఆర్థిక ప్రణాళికలు చూస్తుంటే వాస్తవం నుంచి విరామం తీసుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. లిజ్ ట్రస్ ఆర్థిక విధానంతో పలువురు సీనియర్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిజ్‌ ప్రధాని బాధ్యతలు చేపడతారన్న ఉహే భయం గొలుపుతోందని ఓ సీనియర్ నేత కామెంట్ చేశారు.

Updated Date - 2022-08-22T05:22:21+05:30 IST