కేంద్ర బలగాల పర్యవేక్షణలో..మునుగోడు ఎన్నిక నిర్వహించండి

ABN , First Publish Date - 2022-10-05T09:53:31+05:30 IST

కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌ను కోరింది.

కేంద్ర బలగాల పర్యవేక్షణలో..మునుగోడు ఎన్నిక నిర్వహించండి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ వినతి 

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌ను కోరింది. నియోజకవర్గంలో స్థానిక పోలీసు అధికారులు టీఆర్‌ఎ్‌సకు వత్తాసు పలుకుతున్నందున ఉప ఎన్నిక పారదర్శకంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని పేర్కొంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓడిపోవడంతో ఇక్కడ గెలిచేందుకు అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఎన్నికల సెల్‌ ఇన్‌చార్జ్‌ ఆంథోనిరెడ్డి, సభ్యులు సోమంచి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రదీ్‌పలతో కలిసి మంగళవారం బుద్ధ భవన్‌లో సీఈవోను కలిసి వినతి పత్రం అందజేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌లాగే మునుగోడులో కూడా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. 


ఓడిపోతారని తెలిసే.. కేసీఆర్‌ జాతీయ పార్టీ

వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని గుర్తించిన సీఎం కేసీఆర్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభా్‌ష అన్నారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రాజకీయ నిరుద్యోగిగా మారతారని గమనించిన కేసీఆర్‌, ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయని, దేశంలో ఇప్పుడు ఆయనను ఎవరూ నమ్మడం లేదని సుభాష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పేరిట కొత్త నాటకానికి తెరతీశారని బీజేపీ సీనియర్‌ నేత రవీంద్రనాయక్‌ విమర్శించారు. జాతీయ స్థాయిలో ఏ నాయకుడూ కేసీఆర్‌ను విశ్వసించడం లేదని అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్లలో గిరిజనులకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-10-05T09:53:31+05:30 IST