Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ అసెంబ్లీ ఘటనపై Undavalli సీరియస్ కామెంట్స్..

రాజమండ్రి/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై కొందరు వైసీపీ సభ్యులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. పలువురు సీనియర్ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా ఖండించారు. తాజాగా మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజమండ్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. అసెంబ్లీలో జరిగిన కొన్ని విషయాల గురించి నిశితంగా మాట్లాడారు.


చంద్రబాబుకు తెలియదా..!?

ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు. హరికృష్ణ, పురందేశ్వరితో నాకు పరిచయం ఉంది, వాళ్లు చాలా మంచివారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు. చంద్రబాబుకు తెలియదా.. సంపతీ పనిచేయదని..?. చంద్రబాబు అంతలా స్పందించాల్సిన సమస్య కానేకాదు. ఓ మంత్రి అయితే రేయ్‌, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారు?. విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవించాలి. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు.. పాటలు పాడారుఅని ఉండవల్లి సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా ఇప్పటి వరకూ సీఎం వైఎస్ జగన్‌పై పెద్దగా కామెంట్స్ చేయని ఉండవల్లి.. ఈ మధ్య పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement