Advertisement
Advertisement
Abn logo
Advertisement

14 ఏళ్లుగా దుబాయి జైల్లోనే మగ్గిపోతున్న 74 ఏళ్ల ఈ భారతీయుడి కథేంటంటే..

దుబాయి: 74 ఏళ్ల ఓ భారత వ్యక్తి 14 ఏళ్లుగా దుబాయి జైల్లోనే మగ్గిపోతున్నాడు. అనుకోకుండా జరిగిన తప్పు అతడ్ని ఇలా దశాబ్దానికి పైగా కటకటాల వెనక్కి నెట్టింది. స్నేహితుడికి సాయం చేయబోయిన ఆయన.. అనూహ్యంగా అదే మిత్రుడి మృతికి కారణమయ్యాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు రూ.75 లక్షలు పరిహారం డిమాండ్ చేశారు. పరిహారం ఇస్తే ఆయనకు దుబాయ్ అధికారులు క్షమాభిక్ష ప్రసాధించేలా చేస్తామన్నారు. కలెక్టర్ సమక్షంలో 11 ఏళ్ల క్రితం ఇరువురు కుటుంబాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కానీ, ఈ పరిహారం చెల్లించే స్థోమత లేక 14 ఏళ్లుగా దుబాయ్ జైల్లోనే మగ్గుతున్నాడు. ఇప్పటికీ ఆయన కుటుంబం పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.  


వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం ఇరింజలకుడ కన్నికులంగరాకు చెందిన గోపాల క్రిష్ణన్, నయారంబలంకు చెందిన చంద్రన్ మంచి స్నేహితులు. వారిద్దరూ చాలా ఏళ్లుగా అబుధాబిలో ఒకే రూంలో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో 2007లో జరిగిన ఓ ఘటన గోపాల క్రిష్ణన్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఒకరోజు మిత్రుడు చంద్రన్ తన రూంలోనే ఉండే ఆంధ్ర వ్యక్తితో ఓ విషయమై ఘర్షణకు దిగాడు. వారిద్దరూ అలాగ గొడవ పడుతున్న సమయంలో గోపాల క్రిష్ణన్ కిచెన్‌లో ఉన్నాడు. చాకుతో కూరగాయలు కట్ చేస్తున్న క్రిష్ణన్‌కు స్నేహితుడు చంద్రన్ గట్టిగా అరవడం వినిపించింది. దాంతో చేతిలో చాకుతో పాటే ఆయన బయటకు వచ్చాడు. వచ్చి చూసేసరికి స్నేహితుడు చంద్రన్, ఆంధ్ర వ్యక్తి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. దాంతో చంద్రన్‌ను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు క్రిష్ణన్. ఆ సమయంలో క్రిష్ణన్ చేతిలో ఉన్న చాకు చంద్రన్‌కు బలంగా గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడిన చంద్రన్‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడు. దీంతో చంద్రన్ మృతికి కారణమైన క్రిష్ణన్‌ను దుబాయ్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 


ఈ క్రమంలో 2010లో ఎర్నాకులం కలెక్టర్ సమక్షంలో చంద్రన్, బాలక్రిష్ణన్ ఫ్యామిలీలు ఓ ఒప్పందం చేసుకున్నాయి. చంద్రన్ కుటుంబానికి క్రిష్ణన్ ఫ్యామిలీ పరిహారంగా రూ. 75 లక్షలు ఇవ్వాలనేది ఆ ఒప్పందం. పరిహారం చెల్లిస్తే దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాధించేలా చేస్తామని చంద్రన్ ఫ్యామిలీ తెలిపింది. దీనికోసం క్రిష్ణన్ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, అది వారి స్థోమతకు మించిది కావడంతో వారు నగదు జమా చేయలేకపోయారు. దాంతో 14 ఏళ్లుగా క్రిష్ణన్ దుబాయ్ జైల్లోనే ఉన్నాడు. క్రిష్ణన్ భార్య థనకామని వయసు ఇప్పుడు 70 ఏళ్లు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. క్రిష్ణన్ జైలుకు వెళ్లిన తర్వాత ఈ కుటుంబం మొత్తం అతడిని ఎలాగైనా జైలు నుంచి వీడిపించాలని చూస్తోంది. కానీ, పరిహారం వారికి గుదిబండాల దాపురించింది. అటు మృతుడి భార్య సునీత మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్రిష్ణన్ కుటుంబం నుంచి తనకు ఎలాంటి పరిహారం అందలేదని తెలిపింది. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని చెప్పిన సునీత.. చంద్రన్ సంపాదనతోనే ఇల్లు గడిచేదని తెలిపింది. భర్త మృతితో ఇప్పుడు తన ముగ్గురు కూతుళ్ల భవిష్యతు అగమ్యగోచరంగా మారిందని వాపోయింది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement