రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

ABN , First Publish Date - 2021-05-17T09:25:35+05:30 IST

‘‘రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు’’

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

  • రఘురామను కొవిడ్‌తో చంపాలని చూస్తున్నారు: విష్ణుకుమార్‌ రాజు

విశాఖపట్నం, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతుండడంతో  అరెస్ట్‌ చేసి, తీవ్రంగా కొట్టారని, ప్రజాస్వామ్యం అనేది లేదన్నారు.  గతంలో విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మిత్రుడు నలంద కిశోర్‌ వాట్సా్‌పలో ఏదో పోస్టు పెట్టారని, సీఐడీ అధికారులు కర్నూలు తీసుకెళ్లి, ఆయనకు కరోనా అంటించారని, ఆయన చనిపోవడానికి కారణమయ్యారన్నారు. ఇపుడు రఘురామకృష్ణరాజుకు కూడా అలాగే చేయాలని చూస్తున్నారని  ఆరోపించారు. 

Updated Date - 2021-05-17T09:25:35+05:30 IST