కొవాగ్జిన్‌పై ఉక్రెయిన్‌ ఆసక్తి

ABN , First Publish Date - 2021-02-25T06:15:49+05:30 IST

ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాక్‌సిమ్‌ స్టెపనవ్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు హైదరాబాద్‌,

కొవాగ్జిన్‌పై ఉక్రెయిన్‌ ఆసక్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాక్‌సిమ్‌ స్టెపనవ్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు హైదరాబాద్‌, జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ తయారీ యూనిట్‌ను సందర్శించారు. ఉక్రెయిన్‌ సహాయ ఆరోగ్య మంత్రి ఇగోర్‌ ఇవా్‌షచెంకో, భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి, ట్రేడ్‌ అండ్‌ ఎకనమిక్‌ విభాగం అధిపతి ఐవాన్‌ కొనొవాల్వో.. కొవాగ్జిన్‌ను పొందడంపై భారత్‌ బయో నాయకత్వంతో చర్చించారు.

ఉక్రెయిన్‌ ఆరోగ్య మంత్రి కొవాగ్జిన్‌ తయారీ ప్లాంట్‌ను సందర్శించడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.


Updated Date - 2021-02-25T06:15:49+05:30 IST