పర్యాటకానికి ఊతం.. అన్ని ఆంక్షలు తొలగించనున్న బ్రిటన్.. !

ABN , First Publish Date - 2022-03-16T03:40:50+05:30 IST

కరోనా సంక్షోభం తగ్గుముఖం పడుతున్న కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు తొలగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

పర్యాటకానికి ఊతం..  అన్ని ఆంక్షలు తొలగించనున్న బ్రిటన్.. !

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం తగ్గుముఖం పడుతున్న కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు తొలగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి అన్ని రకాల ఆంక్షల తొలగించనుంది. ఇకపై కరోనా టీకా అంతర్జాతీయ ప్రయాణికులు బ్రిటన్‌కు చేరుకున్నాక పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా.. అంతకుమునుపే ఏయే ప్రాంతాల్లో పర్యటించారనే వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం తప్పుతుంది. ప్రయాణికి రెండు రోజుల ముందు కరోనా టెస్టు చేయించుకోవాల్సిన నిబంధనకూ బ్రిటన్ ముగింపు పలికింది. ‘‘కరోనా ఆంక్షల తొలగింపులో బ్రిటన్ ముందడుగు వేస్తూ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇతకాలం బ్రిటన్ ప్రభుత్వం, ప్రజలు తీసుకున్న చర్యలకు రుజువుగా ఆంక్షల తొలగింపు నిర్ణయం నిలుస్తోంది’’ అని బ్రిటన్ రవాణా శాఖ సెక్రెటరీ సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-16T03:40:50+05:30 IST