మెక్‌డొనాల్డ్స్ కోసం 160 కి.మీ. ప్రయాణం.. రూ. 20 వేల జరిమానా

ABN , First Publish Date - 2021-01-19T04:20:49+05:30 IST

యూకేను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా యూకే ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

మెక్‌డొనాల్డ్స్ కోసం 160 కి.మీ. ప్రయాణం.. రూ. 20 వేల జరిమానా

లండన్: యూకేను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త స్ట్రెయిన్ కారణంగా యూకే ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా నిబంధనలను పెట్టింది. అయినప్పటికి కొంత మందిలో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. యూకేలో ఇటీవల 34 ఏళ్ల ఓ వ్యక్తి కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికి మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. తాను నివసిస్తున్న లూటన్ ప్రాంతంలో మెక్‌డొనాల్డ్స్ లేకపోవడంతో 160 కి.మీ. ప్రయాణించి డెవిజెస్ అనే ప్రాంతానికి వెళ్లాడు. అయినప్పటికి అక్కడ కూడా మెక్‌డొనాల్డ్స్ లేదు. కానీ.. సదరు వ్యక్తి లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన విషయం మాత్రం పోలీసులకు తెలిసిపోయింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి అధికారులు 200 యూరోల(దాదాపు రూ. 20 వేలు) జరిమానా విధించారు.

Updated Date - 2021-01-19T04:20:49+05:30 IST