Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో నాలుగు దేశాల విమాన సర్వీసులపై బ్రిటన్ బ్యాన్ !

లండన్: బ్రిటన్ మరో నాలుగు దేశాల విమాన సర్వీసులపై నిషేధం విధించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ఇథియోపియా, ఒమన్, ఖతార్, సోమాలియా దేశాల విమానాలను యూకే ప్రవేశించడానికి అనుమతించరు. ఈ మేరకు బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్ అండ్ అభివృద్ధి కార్యాలయం ట్వీట్ చేసింది. ఇక ఈ దేశాల నుండి యూకేలోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్న వారందరూ 10 రోజుల పాటు సొంత ఖర్చులతో హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ బ్యాన్ విధించిన దేశాల జాబితాను పరిశీలిస్తే..

అంగోలా

అర్జెంటీనా

బొలీవియా

బోట్స్వానా

బ్రెజిల్

బురుండి

కేప్ వర్దె

చిలీ

కొలంబియా

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 

ఈక్వెడార్

ఈశ్వతిని

ఇథియోపియా (మార్చి 19, శుక్రవారం ఉదయం 4 గంటలకు జాబితాలో చేర్చబడుతుంది)

ఫ్రెంచ్ గయానా

గయానా

లెసోతో

మాలావి

మారిషస్ (మార్చి 19, శుక్రవారం ఉదయం 4 నుండి జాబితా నుండి తొలగించబడుతుంది)

మొజాంబిక్

నమీబియా

ఒమన్ (మార్చి 19, శుక్రవారం ఉదయం 4 గంటలకు జాబితాలో చేర్చబడుతుంది)

పనామా

పరాగ్వే

పెరూ

పోర్చుగల్ (మదీరా మరియు అజోర్స్‌తో సహా.. మార్చి 19, శుక్రవారం ఉదయం 4 నుండి జాబితా నుండి తొలగించబడుతుంది)

ఖతార్ (మార్చి 19, శుక్రవారం ఉదయం 4 గంటలకు జాబితాలో చేర్చబడుతుంది)

రువాండా

సీషెల్స్

సోమాలియా (మార్చి 19, శుక్రవారం ఉదయం 4 గంటలకు జాబితాలో చేర్చబడుతుంది)

దక్షిణాఫ్రికా

సురినామ్

టాంజానియా

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)

ఉరుగ్వే

వెనిజులా

జాంబియా

జింబాబ్వే


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement