రోదసిలోకి మహిళ.. యూఏఈ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2021-04-11T12:28:34+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తొలి సారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష
- ఇద్దరు వ్యోమగాముల పేర్లు
- విడుదల చేసిన దుబాయ్ రాజు
దుబాయ్, ఏప్రిల్ 10: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తొలి సారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష కార్యక్రమం కోసం నౌరా-అల్-మాత్రౌషి, మొహమ్మద్ అల్-ముల్లా పేర్లను దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. మాత్రౌషి యూఏఈ నుంచి తొలి మహిళా వ్యోమగామి. మొత్తం నాలుగు వేల దరఖాస్తులను పరిశీలించి వీరిద్దరిని ఎంపిక చేశారు. టెక్సా్సలో హ్యూస్టన్లోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) లో ఆ ఇద్దరు శిక్షణ పొందుతారు.