ఆ దేశాల వారికి UAE లో ఎంట్రీకి అనుమతి.. కానీ ఇది తప్పనిసరి..

ABN , First Publish Date - 2021-09-11T16:36:50+05:30 IST

కరోనా నేపథ్యంలో ఇంతకుముందు నిషేధం విధించిన 15 దేశాల వారికి యూఏఈలో ప్రవేశానికి నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ), ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్(ఐసీఏ) అనుమతి ఇచ్చాయి. అయితే, ఆయా దేశాల ప్రయాణికులు తప్పనిసరిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన...

ఆ దేశాల వారికి UAE లో ఎంట్రీకి అనుమతి.. కానీ ఇది తప్పనిసరి..

అబుధాబి: కరోనా నేపథ్యంలో ఇంతకుముందు నిషేధం విధించిన 15 దేశాల వారికి యూఏఈలో ప్రవేశానికి నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ), ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్(ఐసీఏ) అనుమతి ఇచ్చాయి. అయితే, ఆయా దేశాల ప్రయాణికులు తప్పనిసరిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన కోవిడ్-19 టీకాలలో ఏదో ఒకటి తీసుకుని ఉండాలి. సెప్టెంబర్ 12(ఆదివారం) నుంచి ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈకి రావొచ్చని ఎన్‌సీఈఎంఏ, ఐసీఏ వెల్లడించాయి. ఈ నిర్ణయంతో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డీఆర్ కాంగో, ఉగాండా, సీర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘానిస్థాన్ దేశాల ప్రయాణికులకు యూఏఈ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. 


ఇవి కూడా చదవండి..

ఈ America రాష్ట్రాల్లో Income Tax కట్టాల్సిన పనిలేదు.. కానీ..

హైదరాబాద్ నుంచి లండన్‌ వెళ్లే వారికి Air India గుడ్‌న్యూస్ !


ఎంట్రీ కోసం దరఖాస్తు ఇలా..

యూఏఈ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ముందుగా ఐసీఏ వెబ్‌సైట్ ద్వారా ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనిలోభాగంగా వ్యాక్సినేషన్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే యూఏఈకి బయల్దేరే ముందు ఆమోదం పొందిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలి. 


ప్రయాణికులు పాటించాల్సిన ఇతర ముఖ్యమైన నిబంధనలు..

1. జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా గుర్తింపు పొందిన లాబొరేటరీ నుంచి తీసుకున్నదై ఉండాలి. దానిపై క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి.

2. అబుధాబి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.

3. టీకా తీసుకున్న ప్రయాణికులు తమ బస వ్యవధిని బట్టి 4, 8వ రోజు మళ్లీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది

4. వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులకు క్వారంటైన్ ఉంటుంది. ఆ సమయంలో తప్పనిసరిగా వారు మెడికల్ రిస్ట్‌బ్యాండ్ ధరించాలి. 9వ రోజున మళ్లీ పీసీఆర్ పరీక్ష ఉంటుంది. 

5. 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.  






Updated Date - 2021-09-11T16:36:50+05:30 IST