అమరావతి ఉద్యమానికి రెండేళ్లు

ABN , First Publish Date - 2021-12-18T08:11:45+05:30 IST

అమరావతి ఉద్యమానికి రెండేళ్లు

అమరావతి ఉద్యమానికి రెండేళ్లు

731వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్లూరు, డిసెంబరు 17: అమరావతి రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల ఉద్యమానికి రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారంతో 731వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో మహిళలు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెయిడ్‌ ఆర్టిస్టులని రైతులను అవమానించడటమే కాకుండా అమరావతిపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. పాలకులే పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టి మూడు రాజధానులంటూ ప్రచారం చేయిస్తున్నారన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితిని సీఎం జగన్‌ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అని ప్రకటించి అభివృద్ధి చేయాలన్నారు. అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగాయి. 

Updated Date - 2021-12-18T08:11:45+05:30 IST