నెల్లూరు: తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం దగ్గర తెలుగుగంగ కాలువలో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఈతకెళ్లిన ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతి చెందిన వారిని పుదూరుకి చెందిన శేషు, జగన్‌లుగా గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి