కన్నడ కవితలు రెండు

ABN , First Publish Date - 2020-07-06T06:26:44+05:30 IST

ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బిజాపూర్‌లో పుట్టారు. ప్రముఖ వేదపండితుని మనమడు. ఈయన చిన్నప్పుడే, ఇంజినీర్‌గా వున్న నాన్న చనిపోయారు. దాంతో మొదట మైసూరులోను, తర్వాత బెంగుళూరులోను తాతల ఇళ్లల్లో పెరిగారు...

కన్నడ కవితలు రెండు

గోపాల్‌ హొన్నల్‌గెరె (1942-2003)

ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బిజాపూర్‌లో పుట్టారు. ప్రముఖ వేదపండితుని మనమడు. ఈయన చిన్నప్పుడే, ఇంజినీర్‌గా వున్న నాన్న చనిపోయారు. దాంతో మొదట మైసూరులోను, తర్వాత బెంగుళూరులోను తాతల ఇళ్లల్లో పెరిగారు. 1970లలో హైదరా బాదు ఒయాసిస్‌ స్కూల్లో కళ, రచన మీద పాఠాలు చెప్పారు. అక్కడ కలిసిన ఒకావిడ్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడ నుంచి ఇద్దరూ పంచగని, విజయవాడ, పంజాబ్‌ మొదలైన ప్రదేశాల్లో స్కూళ్లల్లో పాఠాలు చెబుతూ, తమకి పుట్టిన ఓ బాబు, పాపని వెంటేసుకుని తిరిగారు. అది ఆయనకి ప్రయాణాలు, రచనలు చేసే కాలం. వాళ్ల కొడుకు స్కూలుకి సైకిలు మీద వెళ్తున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో అది ముగిసింది. తర్వాత వైవా హిక జీవితం విచ్ఛిన్నం అయింది. ఆయన చివరి దశలో ఒంటరిగా బెంగుళూరులోని వృద్ధాశ్రమంలో వున్నారు. ఆయనకి కాన్సర్‌ అని డాక్టర్లు తేల్చటంతో చికిత్సకోసం ఓ దగ్గర బంధువు ఢిల్లీ తీసుకె ళ్లాడు. అక్కడే హాస్పటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు.


ఈయన దాదాపు ఆరు పుస్తకాలు అచ్చువేశారు. అన్నీ అమ్ముడు పోయాయి కానీ పునర్ముద్రణ జరగలేదు. వీటిల్లో ‘జెన్‌ ట్రీ అండ్‌ ది వైల్డ్‌ ఇన్నొసెంట్స్‌’ (1973), ‘గెస్చర్‌ ఆఫ్‌ ఫ్లెష్‌లెస్‌ సౌండ్‌’ (1975), ‘వాడ్‌ ఆఫ్‌ పొయమ్స్‌’ (1975), ‘ది ఫిఫ్త్‌’ (1980), ‘ఇంటర్‌నోడ్స్‌’ (1986) ముఖ్యమైనవి. ఇప్పుడు దాదాపు ఆయన్ని కవిగా మర్చిపో యినా, ఆనాటి తన సమకాలీన ఇంగ్లీషు కవుల్తో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేవారు. రాబర్ట్‌ లోవెల్‌, ఆడెన్‌, విలియం స్టాఫోర్డ్‌ ఈయన కవితల్ని మెచ్చుకుంటూ రాశారు.

Updated Date - 2020-07-06T06:26:44+05:30 IST