Abn logo
Mar 4 2021 @ 11:57AM

నక్సలైట్ల మందుపాతర పేల్చివేత...ఇద్దరు జవాన్ల మృతి

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలోని సింఘభూమ్ జిల్లాలో గురువారం నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేల్చివేత ఘటనలో జార్ఖండ్ జాగ్వార్ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. సింఘభూమ్ జిల్లా హోయహతూ అటవీ గ్రామం సమీపంలో గురువారం ఉదయం 8.45 గంటలకు నక్సలైట్లు మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు జార్ఖండ్ జాగ్వార్ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో జార్ఖండ్ జాగ్వార్ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు, మరో సీఆర్ పీఎఫ్ జవాను ఉన్నారని సీఆర్ పీఎఫ్ అధికారులు చెప్పారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించారు. నక్సలైట్ల కోసం జవాన్లు అడవుల్లో గాలిస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. నక్సలైట్ల అణచివేత కోసం జార్ఖండ్ రాష్ట్రం జార్ఖండ్ జాగ్వారా ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. 


Advertisement
Advertisement
Advertisement