కువైత్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్.. చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-02-20T19:05:27+05:30 IST

కువైత్‌లోని వాఫ్రా ప్రాంతంలో ఇంట్లో తయారు చేసిన మద్యం విక్రయిస్తున్న ఇద్దరు భారతీయులను అహ్మదీ పోలీసులు అరెస్టు చేశారు.

కువైత్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్.. చేసిన నేరమేంటంటే..

కువైత్ సిటీ: కువైత్‌లోని వాఫ్రా ప్రాంతంలో ఇంట్లో తయారు చేసిన మద్యం విక్రయిస్తున్న ఇద్దరు భారతీయులను అహ్మదీ పోలీసులు అరెస్టు చేశారు. వాఫ్రా ప్రాంతంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతాధికారులకు ఇరుకైన సందులో ఆపి ఉంచిన కారు కనిపించింది. దాంతో అనుమానం వచ్చి కారు దగ్గరికి వెళ్లారు. అధికారులు రావడం గమనించిన కారు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి తనతో పాటు ఉన్న మరో వ్యక్తితో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అధికారులు వారిద్దరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారును సోదా చేయడంతో ట్రంక్‌లో పెద్ద సంఖ్యలో స్థానికంగా తయారు చేసిన మద్యం సీసాలు లభ్యమయ్యాయి. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. వాటిని విక్రయించడానికి మరోచోటికి తరలిస్తున్నట్లు వారిద్దరు తెలియజేశారు. వారి నుంచి దాదాపు 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. తదుపరి విచారణ కోసం వాటిని సంబంధిత అధికారులకు పంపారు.

Updated Date - 2022-02-20T19:05:27+05:30 IST