Abn logo
Jul 30 2020 @ 10:29AM

పావ్‌ భాజీ స్టాల్‌లో బట్టర్, ఛీజ్, వంటపాత్రల చోరీ

ముంబై : పావ్ భాజీ స్టాల్ లో బట్టర్, ఛీజ్, వంటపాత్రలను చోరీ చేసిన ఘటన ముంబై నగరంలోని ఆజాద్ మైదాన్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబై నగరానికి చెందిన దండేకర్ కు ఆజాద్ మైదాన్ ప్రాంతంలో పావ్ భాజీ స్టాల్ నిర్వహిస్తున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ సబ్ వే ప్రాంతానికి చెందిన సంతోష్, కరణ్ ధర్మా జాదవ్ లు కలిసి పావ్ భాజీ స్టాలు గ్రిల్ తాళం పగుల గొట్టి చోరీ చేశారు. స్టాల్ లో ఉన్న 80 కిలోల బట్టర్, 20 కిలోల ఛీజ్, అల్యూమినియం వంట పాత్రలు, 90 పావ్ భాజీ ట్రేలు, మిక్చర్లు, గ్రైండర్లు, డిష్ వాష్ లను ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తు విలువ లక్షరూపాయలుంటుందని బాధితుడు చెప్పారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వంటపాత్రలను స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement
Advertisement
Advertisement