Abn logo
Feb 26 2021 @ 02:47AM

బావిలో క్రేన్‌ కూలి ఇద్దరు మృతి !

హుస్నాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 25: వ్యవసాయ బావి తవ్వకం పనులు చేస్తుం డగా క్రేన్‌ పట్టుతప్పి బావిలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం బల్లునాయక్‌ తండాలో గురువారం జరిగింది. తండాకు చెందిన లావుడ్య దుర్గ బావిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు 15 రోజులుగా పనులు చేస్తున్నారు. గురువారం బావిలో భీమా, దేవోజు, ఇస్లావత్‌ వెంక్యనాయక్‌లు పని చేస్తుండగా, బావిపైన  చాందిని, సరోజ క్రేన్‌ నడిపే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాళ్ల బరువు ఎక్కువై క్రేన్‌ బావిలోకి పడిపోయింది. క్రేన్‌ పట్టుకున్న లావుడ్య చాందిని (35), బావిలో ఉన్న ఆమె బావ లావుడ్య భీమా (50) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన వెంక్యనాయక్‌, లావుడ్య దేవోజులను ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement
Advertisement