కోవిడ్‌కు చెక్ పెట్టే లామాల నానో బాడీస్
ABN , First Publish Date - 2020-07-14T13:18:36+05:30 IST
కరోనా వైర్‌సలోని స్పైక్ ప్రొటీన్ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది.
లండన్, జూలై 13: కరోనా వైర్‌సలోని స్పైక్ ప్రొటీన్ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది. దీనిని అడ్డుకోగలిగితే.. కరోనా వ్యాప్తికి ఆదిలోనే అంతం పలకొచ్చు. ఈ దిశగా ప్రయోగాలు జరిపిన బ్రిటన్‌లోని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఆశాజనక ఫలితాలను సాధించారు. ఒంటెలా ఉండే లామాల రక్తంలోని నానోబాడీలను.. స్పైక్ ప్రొటీన్లతో పరస్పరం చర్య జరిపించారు. హెచ్11-హెచ్4, హెచ్11-డీ4 అనే రెండు నానోబాడీలు స్పైక్ ప్రొటీన్ మొన భాగాన్ని దుప్పటిలా కప్పేశాయి. ఫలితంగా ఏసీఈ2లోకి స్పైక్ ప్రొటీన్ చొచ్చుకు వెళ్లలేకపోయింది.