Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడప-మదనపల్లె-బెంగుళూరు కొత్త రైలుమార్గం ఇంతేనా?: తులసిరెడ్డి

వేంపల్లె, జూన్‌ 5: రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి కడప-మదనపల్లె-బెంగుళూరు కొత్త బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గం పూర్తికావడం ఎంతో అవసరమని, కానీ జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పనులు నిలిచిపోయాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిధులు చెల్లించే షరతుతో 2006-07లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిని మంజూరు చేసిందన్నారు. మొత్తం పొడవు 268 కిలోమీటర్లు కాగా ఇప్పటివరకు 21.80 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందన్నారు. మొత్తం అంచనా విలువ రూ.3,038 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.351కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.132.39కోట్లు చెల్లించిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం వాటాగా ఒక్కపైసా చెల్లించలేదన్నారు. దీంతో రైల్వేశాఖ పనులు పూర్తిగా నిలిపివేసిందన్నారు. సలహాదారులకు, లాయర్ల కోర్టు ఫీజులకు, ప్రకటనలకు వేలకోట్లు దుబారా చేస్తున్న జగన్‌ ప్రభుత్వం.. కడప-మదనపల్లె-బెంగుళూరు రైలు మార్గానికి నిధులు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. 

Advertisement
Advertisement