టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-02-24T09:09:24+05:30 IST

టీటీడీపై సోషల్‌ మీడియాలో అవాస్తవ, శ్రీవారిని కించపరిచేలా పోస్టులు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు

  • పరిశీలనలో తిరుమలకు మోనో రైలు: వైవీ సుబ్బారెడ్డి 

తిరుపతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): టీటీడీపై సోషల్‌ మీడియాలో అవాస్తవ, శ్రీవారిని కించపరిచేలా పోస్టులు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2,300 కోట్ల శ్రీవారి నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు టీటీడీ మళ్లిస్తోందంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడాన్ని ఆయన ఖండించారు. ఈ అంశంపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. తిరుమలకు మోనో రైలు, లైట్‌ మెట్రో ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

Updated Date - 2020-02-24T09:09:24+05:30 IST