Abn logo
Jun 18 2021 @ 21:01PM

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం శనివారం జరుగనుంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్య పెంపుపై చర్చించనున్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయనున్నారు. టీటీడీ ఆస్పత్రుల్లో మందులు కొనుగోళ్లపై చర్చ జరుగనుంది.  టీటీడీ విద్యాసంస్థల్లో హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేసే అంశంపై చర్చించనున్నారు. మూడో దశలో 1389 సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో త్వరలో 500 ఆలయాల నిర్మాణం చేపట్టాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తారు.