‘ఎస్సీ కార్పొరేషన్‌’ హుజూరాబాద్‌ వాసికే

ABN , First Publish Date - 2021-07-24T08:22:10+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రక

‘ఎస్సీ కార్పొరేషన్‌’ హుజూరాబాద్‌ వాసికే

చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ నియామకం

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌  అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్థి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్‌) చైర్మన్‌ పదవిని కూడా హుజూరాబాద్‌ వాసికే ప్రభుత్వం కట్టబెట్టింది. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివా్‌సను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివా్‌సది కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌.. విద్యార్థి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రె్‌సలో పలు హోదాల్లో, ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్‌ జిల్లా కార్యదర్శిగానూ శ్రీనివాస్‌ పనిచేశారు. హాకీ క్రీడాకారుడిగా రాణించిన ఆయన..  హాకీ క్లబ్‌ కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్‌ టౌన్‌ నుంచి ఎంపీటీసీగా రెండు మార్లు ఎన్నికయ్యారు. 

Updated Date - 2021-07-24T08:22:10+05:30 IST