Abn logo
Oct 18 2020 @ 17:54PM

మంత్రి సబితను అడ్డుకున్న స్థానికులు

Kaakateeya

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సబితాఇంద్రారెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. మీర్‌పేట్‌ మిథిలానగర్‌లో మంత్రి సబితను స్థానికులు అడ్డుకున్నారు. ముంపు సమస్య తీర్చకుండా ఓదార్పు యాత్రలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి వరద బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు వెనక్కి తగ్గారు.


గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షాలతో పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement