Abn logo
Oct 28 2021 @ 07:34AM

ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలకు కళ్లెం!

యూఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో మహిళా భద్రతా విభాగం భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో తిష్టవేసిన ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం చర్యలు చేపట్టింది. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల వివాదాలను పరిష్కరించేందుకు పలు దేశాల ఎంబసీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌లోని అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ యూనిట్‌ ప్రతినిధులతో హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి భేటీ అయ్యారు. అమెరికాలో ఉన్న నిందితులను ఇక్కడికి రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్టీఫెన్‌ విల్గర్‌తో ప్రధానంగా చర్చించారు.  

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...