పర్యటనకు ముందు.. అమెరికా అధ్యక్షుడి ఆసక్తికర ట్వీట్!

ABN , First Publish Date - 2020-02-23T20:59:54+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా సతీసమేతంగా భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తరహాలోనే అహ్మదాబాద్‌లోని సర్దార్ పటే

పర్యటనకు ముందు.. అమెరికా అధ్యక్షుడి ఆసక్తికర ట్వీట్!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా సతీసమేతంగా భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తరహాలోనే అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ట్రంప్ పర్యటనకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉండటంతో.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం విజయవంతం కావడం కోసం అధికారులందరూ తలమునకలై ఉన్నారు. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు సర్దార్ పటేల్ స్టేడియం మార్గంలో  స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే గాలి తీవ్రతకు ఓ స్వాగత ద్వారం కుప్పకూలింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 


ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కంటే.. తానే ముందున్నానంటూ మొదటి నుంచి చెప్పుకుంటున్న ట్రంప్.. భారత పర్యటన నేపథ్యంలో ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్‌లో 70లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మొన్నటిదాకా ఉత్సాహంగా చెప్పిన ట్రంప్,  ఆ సంఖ్యను కోటికి పెంచేశారు. అయితే అధికారులు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ట్విట్టర్‌లో ట్రంప్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ట్రంప్ బాహుబలిగా కనిపించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వీడియోలో ప్రధాని మోదీ.. ఆయన సతీమణి జశోదాబెన్ కూడా ఉన్నారు. సినిమాలోని ఓ చిన్నభాగంలో హీరో ప్రభాస్ ముఖాన్ని ఎడిట్ చేసి.. ఆ స్థానంలో ట్రంప్ ముఖాన్ని పెట్టి ఎవరో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ‘ఇండియాలోని నా స్నేహితులను కలవడం కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా’ అంటూ ట్రంప్ ఆ వీడియోను షేర్ చేశారు. 


Updated Date - 2020-02-23T20:59:54+05:30 IST