కరోనాపై ట్రంప్ ప్లాన్.. షాకింగ్ న్యూస్ వెల్లడించిన వైట్‌హౌస్!

ABN , First Publish Date - 2021-01-25T09:19:19+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి విలయ తాండవమే చేసింది. ఇదంతా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే జరిగింది. మరి

కరోనాపై ట్రంప్ ప్లాన్.. షాకింగ్ న్యూస్ వెల్లడించిన వైట్‌హౌస్!

వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి విలయ తాండవమే చేసింది. ఇదంతా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే జరిగింది. మరి ఈ విపత్తును తట్టుకునేందుకు ట్రంప్ ఏం ప్లాన్ చేశారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావించారు? అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఈ ప్రశ్నలకు ఇప్పుడు షాకింగ్ సమాధానం దొరికింది. ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ గురించి బైడెన్ పాలక వర్గంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిలో ఉన్న రాన్ క్లెయిన్ మాట్లాడారు. ‘‘మేం వైట్‌హౌస్‌లోకి వచ్చినప్పుడు.. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఎటువంటి విధానమూ లేదు’’ అని షాకింగ్ విషయం వెల్లడించారు. దేశంలో లక్షలాది వ్యాక్సిన్ల పంపిణీ జరిగినప్పటికీ.. వాటిలో కేవలం సగం మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని క్లెయిన్ వెల్లడించారు.

Updated Date - 2021-01-25T09:19:19+05:30 IST