ట్రంప్ సలహాలు మాకు అవసరం లేదు: వైట్‌హౌస్

ABN , First Publish Date - 2021-03-07T05:50:50+05:30 IST

ఇమ్మిగ్రేషన్ పాలసీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాలను తాము తీసుకోమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ

ట్రంప్ సలహాలు మాకు అవసరం లేదు: వైట్‌హౌస్

వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ పాలసీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాలను తాము తీసుకోమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. ట్రంప్ ప్రభుత్వంలో తీసుకున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు అవమానకరమైనవని, ఉపయోగం లేనివని ఆమె అన్నారు. జో బైడెన్ ఇమ్మిగ్రేషన్ అజెండాను వ్యతిరేకిస్తూ ట్రంప్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనపై స్పందిస్తూ జెన్ సాకి ట్రంప్‌పై పలు విమర్శలు చేశారు. బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల దక్షిణ సరిహద్దులో వలసలు పెరిగిపోయాయంటూ ట్రంప్ తన లేఖలో చెప్పుకొచ్చారు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను బైడెన్ వెనక్కు తీసుకోవడం వల్ల సరిహద్దులో సంక్షోభానికి దారితీసిందని ట్రంప్ అన్నారు. 


ఇమ్మిగ్రేషన్ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలను జెన్ సాకి స్వాగతించారు. తాము తమ స్వంత మార్గాన్ని ముందుకు తీసుకెళ్తామని జెన్ సాకి చెప్పారు. వలసదారుల పిల్లల విషయంలో మానవత్వంతో, గౌరవంతో వ్యవహరిస్తామన్నారు. వలసదారుల పిల్లలు సరిహద్దులను దాటినప్పుడు వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-03-07T05:50:50+05:30 IST