టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2020-02-17T02:48:15+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఘనంగా నిర్వహించింది. శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేప్‌టౌన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఘనంగా నిర్వహించింది. శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 


ఈ సందర్భంగా టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు మట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి అద్భుతమని కొనియాడారు. దేశ ప్రధాని మోదీ సైతం పార్లమెంట్‌లో తెలంగాణ పురోగతి చెందిందని.. ఆర్థికంగా పటిష్టమైందని కొనియాడినట్టు గుర్తుచేశారు. 


కాగా.. కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన హరిత హారం కార్యక్రమాన్ని తూ.చా తప్పకుండా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ పాటిస్తోందని తెలిపారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలను నాటడంతో పాటు అనాథ శరణాలయాలలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కమిటీ సభ్యులు చెప్పారు. 


అంతేకాకుండా టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆదేశాలతో.. జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్‌లలోని అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని కోర్ కమిటీ సభ్యులు తెలిపారు.


చారిటీ ఇంచార్జ్‌లు శ్రీధర్ అగ్గన, అరవింద్ చీకోటిల ఆధ్వర్యంలో కోర్ కమిటీ టీం ఆహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అలాగే కేప్‌టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల, డర్బన్ ఇంచార్జ్ రవిన్ రెడ్డి , శ్రీనివాస్‌లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 


గతంలో కూడా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమమును చాలెంజ్‌గా తీసుకున్నట్టు పత్రికా ప్రకటన ద్వారా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి తెలియజేశారు. 


ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ విసిరిన చాలెంజ్‌ను కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు స్వీకరించి అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందని కిరణ్ కుమార్ అన్నారు.

Updated Date - 2020-02-17T02:48:15+05:30 IST