‘గులాబీ’ వ్యూహం

ABN , First Publish Date - 2022-01-28T06:29:33+05:30 IST

‘గులాబీ’ వ్యూహం

‘గులాబీ’ వ్యూహం

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సరికొత్త ఎత్తుగడ!

 జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఆచీతూచి నిర్ణయం

 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నియామకాలు

పరకాలపై నజర్‌ వేసిన గండ్ర జ్యోతికి పదవితో చెక్‌!

పకడ్బందీ ప్లాన్‌ ప్రకారమే ములుగులో జగదీశ్‌కు అవకాశం 

భూపాలపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి : టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికల్లో అధిష్ఠానం వ్యూహా త్మకంగా వ్యవహరించిందని తెలుస్తోంది. వచ్చే   అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సారథ్యం అప్పగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్ష పదవిలో ఉండే నేతలే భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటు ఆశించించకుండా వ్యూహాత్మకంగా చెక్‌ పెట్టిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్థిక బలంతో పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృత సంబంధాలు ఉన్న వ్యక్తులను ‘గులాబీ’ కుర్చీలో కూర్చొపెట్టారు. అయితే.. మొదటి నుంచి ‘కారు’ స్టీరింగ్‌ కోసం ఆశలు పెట్టుకున్న నేతల్లో కొందరు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని లాక్కునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు చేస్తుం డటంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

తొలిసారిగా రథ సారథులు

చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా జిల్లా అధ్యక్షులను టీఆర్‌ఎస్‌ నియమించింది. 2016 అక్టోబరు 11న కొత్త జిల్లాలు ఏర్పడ్డాక దాదాపు అన్ని పార్టీలూ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే.. 2017లోనే టీఆర్‌ఎస్‌ కూడా జిల్లా కమిటీలు వేసేందుకు కసరత్తు చేసింది. ఎందుకో గానీ వెనకడుగు వేసింది. దీంతో అప్పటి నుంచి గ్రామ, మండల కమిటీలతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలే నియో జకవర్గంలో అన్నీ తామై చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2021లోనే మళ్లీ జిల్లా కమిటీల ప్రస్తావన తెర పైకి వచ్చింది. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. 2021 అక్టోబ రులోనే జిల్లా కమిటీలను నియమించి, కొత్తగా నిర్మించిన జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించా లని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, మరోసారి జిల్లా కమిటీలపై అధిష్ఠానం వెనుక్కి తగ్గింది. దీంతో ఇక జిల్లా కమిటీలు వేయని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా బుధ వారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ జిల్లా అధ్యక్షుల ను ప్రకటించటంతో ‘గులాబీ’ శ్రేణుల్లో జోష్‌ నింపింది. 

వ్యూహాత్మకంగా అధ్యక్షుల ఎంపిక..

భూపాలపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, వరంగల్‌ రూర ల్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతిని అధిష్ఠానం నియమించింది. హనుమకొండ జిల్లా శాయంపేట జడ్పీటీసీగా ఎన్నికైన ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. పరకాల పట్టణానికి చెందిన గండ్ర జ్యోతి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే పరకాల ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిం చారు. ప్రస్తుతం జడ్పీ చైర్‌పర్సన్‌ హోదాలో పరకాల నియోజకవర్గంలో ఉన్న తన పాత కేడర్‌ను చేరతీసే పనిలో పడ్డారు. దీంతో పాటు అవకాశం ఇస్తే పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జ్యోతి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోం ది.  దీంతో పరకాల నియోజకవర్గంలో జరి గే ఏ కార్యక్రమానికి కూడా గండ్ర జ్యోతి హాజరుకాకుండా స్థానిక ఎమ్మెల్యే అధికారు లపై ఒత్తిడి తెచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి గండ్ర దంప తులు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వేర్వేరుగా తీసుకెళ్లినట్టు తెలిసింది. దీనికి తోడు భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో గండ్ర జ్యోతి కీల కంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా గతంలో కాంగ్రె స్‌ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం కూడా ఉండటంతో జిల్లాపై ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహ న ఉందని అధిష్ఠానం అంచనా వేసింది. దీంతో జ్యోతికి భూపాలపల్లి జిల్లా పగ్గాలు ఇవ్వటంతో పూర్తి స్థాయిలో ఇక్కడి రాజకీయాలకు పరిమితం కావటంతో పాటు పర కాల టికెట్‌ విషయంలో పరోక్షంగా చెక్‌ పెట్టడం, ఇరు వర్గాల మధ్య విభేదాలు లేకుండా చేసేందుకు వ్యూహా త్మకంగా అధిష్ఠానం వ్యవహరించిందనే ప్రచారం జరుగుతోంది. 

ములుగు జిల్లా విషయంలోనూ ఇదే వ్యూహంతో అ  జగదీశ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవిపై ఆ పార్టీ సీనియర్‌ నేత గోవింద్‌నాయక్‌తో పాటు మాజీ మంత్రి చందూలాల్‌ తనయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ ప్రహ్లాద్‌, ఏటూరునాగారానికి చెందిన లక్ష్మ ణ్‌బాబు, గోవిందరావుపేట జడ్పీటీసీ హరిబాబు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ములుగు నియోజ కవర్గం ఎస్టీ రిజర్వ్‌ర్డ్‌ సీటు కావటంతో అధిష్ఠా నం ఆచీ తూచి వ్యవహరించిందనే టాక్‌ వస్తోంది. ఇప్ప టికే ఏటూరునాగారం జడ్పీటీసీగా ఉన్న జగదీశ్‌ జడ్పీ చైర్మ న్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుంచే జిల్లా అధ్య క్షుడిని నియమిస్తే మిగతా ప్రాంతాల నుంచి, ముఖ్యం గా జిల్లా కేంద్రం నుంచి అభ్యంతరాలు వస్తాయనే ఆలోచనతో అధిష్ఠానం లక్ష్మణ్‌బాబు విషయంలో వెనక్కి తగ్గినట్ట సమాచారం. ఇక గోవింద్‌నాయక్‌, ప్రహ్లాద్‌లలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా పార్టీ వారి కంట్రోల్‌లోకి వెళ్తుంది. వచ్చే ఎన్నికల నాటికి వారిలో ఒకరు టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి అనే ప్రచారం జరుగుతుంది. దీంతో పార్టీలో విభేదాలు పొడచూపే అవకాశం ఉంటుంది. దీంతోపా టు ములుగు ఎమ్మెల్యే సీతక్క లాంటి ఫైర్‌బ్రాండ్‌ నేతను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన సమయంలో పార్టీలో విభేదాలు మరింత నష్టం కలిగిం చొచ్చనే ఉద్దేశంతో జగదీశ్‌ వైపు పార్టీ మొగ్గు చూపిన ట్టు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జగదీశ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు. పైగా జిల్లా అంతటా తిరిగే అవకాశం ఉంది. అన్ని మం డలాల్లో పార్టీపై ఇప్పటికే కొంత పట్టు కూడా సాధించా రు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారి కోసం జగదీశ్‌ పని చేస్తారు కాబట్టే అధిష్ఠానం గిరి జనేతరుడైన ఆయన వైపు మొగ్గు చూపినట్టు ‘గులాబీ’ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

ఆశావహుల్లో నైరాశ్యం...

జిల్లా సారథ్యం  కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న టీ ఆర్‌ఎస్‌ నేతల్లో నైరాశ్యం నెలకొంది. అనూహ్యంగా అధిష్ఠానం రెండు జిల్లాల్లో ఇద్దరు జడ్పీ చైర్‌పర్సన్లకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దీంతో చాలా మంది నేతలు బయటపడకున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి ప్రధానంగా టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి కోసం వాసుదేవరెడ్డి, బుర్రా రమేష్‌, సిరికొండ ప్రశాంత్‌,  పైడిపల్లి రమేష్‌, చ ల్లా నారాయణరెడ్డి, తాళ్లపల్లి దామోదర్‌గౌడ్‌, జోగు బుచ్చయ్యతో పాటు డజను మందికి పైగా పేర్లు విని పించాయి. వీరిలో ఇద్దరు ముగ్గురిలో ఎవరికో ఒకరికి సారథ్యం ఖాయం అనుకున్నారు. అయితే.. అనూ హ్యంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పేరును అధిష్ఠానం ప్రకటించటంతో కొంద రు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం అన్ని పదవులూ ఆ కుటుంబానికేనా..? అనే అసం తృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది.  ములుగు జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న అరడజను మంది నేతల్లో ఒకరిద్దరు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే పదవి ఉండగా, మరో పదవి కూడా జగదీశ్‌కేనా..? అని మదన పడుతున్నారు. ఇదే క్రమంలో పార్టీ పదవి ఆశించి భంగపడిన నేతలకు కాంగ్రెస్‌, బీజేపీ నేతల నుంచి పరామర్శలు, సానుభూతి సందేశాలు వెళ్తున్నట్టు  తెలిసింది. ఎన్నాళ్లు ఉన్నా ఎదుగుబొదుగు లేకుండా ఉండాల్సి వస్తోందని, తమతో కలిసి రావాలని ఆ పార్టీలు ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


Updated Date - 2022-01-28T06:29:33+05:30 IST