మాతో టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-07-26T08:19:13+05:30 IST

టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

మాతో టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కేసీఆర్‌ను ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నారు

27 తరువాత పుంజుకోనున్న చేరికలు: ఈటల 

జడ్చర్ల, జూలై 25: టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయని చెప్పారు. టీఆర్‌ఎ్‌సలోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జరిగే బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ కావేరమ్మపేటలో ఈటల విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనన్నారు. మోదీకి అండగా నిలిచేందుకు, బీజేపీ జెండా ఎగురవేసేందుకు యువత, రైతులు, మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు సంబంధించిన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. తమ పంచాయితీ కేసీఆర్‌తో మాత్రమేనని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాదని అన్నారు. కేసీఆర్‌ అహంకారాన్ని తాను కాస్త ముందుగా ఎదిరించానని, అదే బాటలో నడిచేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని బహిర్గతం కాలేకపోతున్నారని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానన్నారు. ఇక కాంగ్రె్‌సది డంబాచారమే తప్ప.. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఆ పార్టీకి లేదని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమ పార్టీలో చేరవచ్చన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర నాయకుడు శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-26T08:19:13+05:30 IST