Abn logo
Feb 22 2020 @ 03:00AM

పాకిస్థాన్‌కు అనుకూలంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌, ఎంఐఎం

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ 


కల్వకుర్తి అర్బన్‌, ఫిబ్రవరి 21: టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు పాకిస్థాన్‌కు అనుకూలంగా పని చేస్తున్నాయని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. సీఏఏను సీఎం కేసీఆర్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమా ండ్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అలజడులకు విదేశాల నుంచి నిధులు సమకూరుతుండగా.. తెలంగాణలో ఎంఐఎంకు టీఆర్‌ఎస్‌ పార్టీ నిధులను సమకూర్చుతోందని ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేసి నిధులు రాబట్టుకుంటూనే.. తెలంగాణలో మాత్రం కేంద్రాన్ని విమర్శించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. మతపరమైన చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్యలు స్పష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
Advertisement