Abn logo
Feb 22 2020 @ 03:12AM

డీసీసీబీ పీఠాలపై ‘గులాబీ’ గురి

మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నం.. 

డీసీసీబీ దక్కకపోతే డీసీఎంఎస్‌ టార్గెట్‌

టెస్కాబ్‌ చైర్మన్‌ రేసులో రవీందర్‌రావు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సహకార సమరంలో కీలకమైన డీసీసీబీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడడంతో ఉమ్మడి జిల్లాల వారీగా చైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో పీఏసీఎ్‌సలకు చైర్మన్లుగా 90 శాతానికి మించి టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలవడంతో అన్ని డీసీసీబీలు, డీసీఎంఎ్‌సలూ గులాబీ ఖాతాలో పడడం ఇప్పటికే ఖాయమైంది. ఈనెల 29న పాలకవర్గాలు ఏ ర్పాటు కానున్న నేపథ్యంలో చైర్మన్‌ అభ్యర్థులను ఎంపిక చే యటం అధికార పార్టీ ముఖ్యులకు కత్తిమీద సాములా మా రింది. కీలకమైన పదవులకు అభ్యర్థులను సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎంపిక చేయనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలతోపాటు సామాజిక వర్గాలు, ఉద్యమ నేపథ్యం, సీనియారిటీ, విధేయతను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎన్నికకు కొన్ని గంటల ముందు మాత్రమే అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు, డీసీసీబీ పీఠాలపై గురిపెట్టిన గులాబీ నేతలు... ఎ మ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతల ద్వారా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి దక్కకపోతే డీసీఎంఎ్‌సనైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. చాలా తక్కువ సొసైటీలను గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ... డీసీసీబీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపే పరిస్థితి కూడా లేదు. 


ఆశావహులు ఎందరో?

ప్రస్తుతం టెస్కాబ్‌ చైర్మన్‌గా ఉన్న కొండూరు రవీందర్‌రావుకు.. కరీంనగర్‌ డీసీసీబీ దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని గంభీరావుపేట పీఏసీఎస్‌ నుంచి ఆయన చైర్మన్‌గా ఎన్నికయ్యారు. డీసీసీబీతోపాటు టెస్కాబ్‌ చైర్మన్‌గా కూడా రవీందర్‌రావుకే హామీ లభించినట్లు తెలిసింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవికి ఐనవోలుకు చెందిన మార్నేని రవీందర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రధాన అనుచరుడు కావటంతో ఆయన ఎన్నిక లాంఛనమేనన్న చర్చ జరుగుతోంది. రవీందర్‌రావుతోపాటు గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, మోటపోతుల మనోజ్‌గౌడ్‌ రేసులో ఉన్నారు. 


నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీప బంధువు రమేశ్‌రెడ్డి, బోధన్‌కు చెందిన గిర్దవార్‌ గంగారెడ్డి సైతం రేసులో ఉన్నారు. 


నల్లగొండ డీసీసీబీకి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డితోపాటు పల్లా ప్రవీణ్‌రెడ్డి, సుంకరి మల్లేశ్‌గౌడ్‌ పోటీ పడుతున్నారు.


రంగారెడ్డి డీసీసీబీ రేసులో మనోహర్‌రెడ్డి ప్రధాన పోటీదారుగా, ఆలూరు కృష్ణారెడ్డి, పెంటారెడ్డి బరిలో ఉన్నారు. 


ఆదిలాబాద్‌లో అడ్డి బోజారెడ్డి, ముడుపు దామోదర్‌రెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డి మధ్య పోటీ ఉంది.


మెదక్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి మధ్య పోటీ ఉంది. 


ఖమ్మంలో మువ్వా విజయబాబు, తుళ్లూరు, బ్రహ్మయ్య, మందడపు సుధాకర్‌, శేషగిరిరావు, నాగభూషణం.. డీసీసీబీ పదవి ఆశిస్తున్నారు. 


మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు నాగర్‌కర్నూల్‌కు చెందిన జక్కా రఘునందన్‌రెడ్డి, తలసాని జనార్దన్‌రెడ్డి, మామిళ్ల విష్ణువర్థన్‌రెడ్డి డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement