Abn logo
Mar 2 2021 @ 19:04PM

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రంగంలోకి ట్రబుల్ షూటర్

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ట్రబుల్ షూటర్ ఎంట్రీ ఇచ్చారు. నిన్న, మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా మీదే ఫోకస్ పెట్టిన హరీశ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ టాస్క్‌లో బిజీ అయి పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలగాన్ని మొత్తం రంగంలోకి దింపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించారు. వారు ప్రతి ఓటర్లను కలిసే విధంగా ప్లాన్ చేశారు. వారిని పర్యవేక్షించే బాధ్యతను జిల్లాల వారీగా మంత్రులకు అప్పగించారు. ఇటీవల కాలం వరకు మెదక్ జిల్లాకే పరిమితమైన హరీశ్ రావుకు సైతం అనూహ్యంగా కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను అప్పగించారు. దీని మీద ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement
Advertisement