ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: జగన్‌

ABN , First Publish Date - 2021-08-09T01:46:39+05:30 IST

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఆదివాసీ గూడెంలో ఘనంగా జరుపుకోవాలని సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర ఆధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: జగన్‌

భూపాలపల్లి: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఆదివాసీ గూడెంలో ఘనంగా జరుపుకోవాలని సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర ఆధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. దేశంలో 8.6 శాతం జనాభా ఉన్న ఆదివాసీలు ఇప్పటికీ అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.  హరితహారం పేరుతో  ఆదివాసీల భూముల చుట్టూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బౌండరీలు ఏర్పాటు చేసి వారిని వెళ్లగొడుతోందని విమర్శించారు. పోలవరం డ్యాంలో 75 ఆదివాసీ గ్రామాలను ముంచారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం, తుపాకులగూడెం నీటి ప్రాజెక్టుల మూలంగా ఆదివాసీ రైతులు వందల ఎకరాల సాగు భూములను కోల్పోయారని పేర్కోన్నారు. కుమ్రం భీం జిల్లాల్లో కవ్వాల టైగర్‌ జోన్‌ ప్రాజెక్టు పేరుతో ఆదివాసీల ఇళ్లను  బలవంతంగా ఖాళీ చేయించి వెళ్లకోట్టారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో యురేనియం తవ్వకాల కోసం, అభయారణ్యాల పేరుతో చెంచులను అడవుల నుంచి గెంటేసే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తోందని జగన్ దుయ్యబట్టారు.

Updated Date - 2021-08-09T01:46:39+05:30 IST