వెంచర్‌ కోసం చెట్ల నరికివేత..‘రియల్‌’ సంస్థకు 20 లక్షల జరిమానా

ABN , First Publish Date - 2021-04-13T08:40:59+05:30 IST

ప్రభుత్వ అనుమతి లేకుండా భారీ వృక్షాలను తొలగించిన ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థకు అటవీశాఖ భారీ జరిమానా విధించింది.

వెంచర్‌ కోసం చెట్ల నరికివేత..‘రియల్‌’ సంస్థకు 20 లక్షల జరిమానా

  • బోంరా్‌సపేట్‌లో భారీ వృక్షాల తొలగింపు
  • అనుమతుల్లేకుండానే అడ్డంగా నరికివేత

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): ప్రభుత్వ అనుమతి లేకుండా భారీ వృక్షాలను తొలగించిన ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థకు అటవీశాఖ భారీ జరిమానా విధించింది. ఈ సంఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం బోంరా్‌సపేట్‌లో  చోటుచేసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారీఎత్తున చెట్లు కొట్టివేయడంతో జిల్లా అటవీశాఖ ఆ సంస్థకు రూ.20లక్షల జరిమానా విధించింది. బొంరా్‌సపేట్‌ గ్రామంలోని సర్వేనెంబర్లు 344, 347, 348, 353, 354లలో దాదాపు 50ఎకరాలకు పైన వాసవి గ్రీన్‌ లీఫ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వెంచర్‌ను ఏర్పాటుచేసింది. ఈ వెంచర్‌ విస్తరణలో వందలాది చెట్లను నరికివేసినట్లుగా జిల్లా అటవీ శాఖ అధికారికి ఫిర్యాదు అందింది. దీంతో ఈనెల 3న అటవీశాఖ అధికారులు రియల్‌ఎస్టేట్‌ సంస్థపై వాల్టాచట్టం కింద కేసు నమోదు చేశారు.  డీఎ్‌ఫవో వెంకటేశ్వర్లు, కీసర ఎఫ్‌ఆర్వో అఫ్రోజ్‌ దర్యాప్తు అనంతరం రూ. 20 లక్షల జరిమానా విధించి, వసూలు చేశారు. జరిమానాతోపాటు.. మళ్లీ  మొక్కలు నాటాలని ఆదేశించినట్లు డీఎ ఫ్‌వో వెంకటేశ్వర్లు వెల్లడించారు. చెట్లను కొట్టేందుకు అటవీశాఖ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.శోభ వెల్లడించారు. కాగా.. ఇటీవల ఓ లేఅవుట్‌ విషయంలో తనకూ వాటా కావాలంటూ సర్పంచ్‌ భర్తతో మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అది కూడా గ్రీన్‌ లీఫ్‌ వెంచర్‌కు సంబంధించి కావడం గమనార్హం..!

Updated Date - 2021-04-13T08:40:59+05:30 IST