ట్రాన్స్‌జెండర్లకూ ఓ ఫుట్‌బాల్‌ జట్టు

ABN , First Publish Date - 2020-03-31T10:16:49+05:30 IST

క్రీడల్లో పురుషులు, మహిళల జట్లు సాధారణంగా కనిపించేవే. కానీ, దేశంలో తొలిసారి మణిపూర్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఏర్పాటైంది. యవోల్‌ అనే స్వచ్ఛంద ...

ట్రాన్స్‌జెండర్లకూ ఓ ఫుట్‌బాల్‌ జట్టు

దేశంలో తొలిసారి మణిపూర్‌లో

న్యూఢిల్లీ: క్రీడల్లో పురుషులు, మహిళల జట్లు సాధారణంగా కనిపించేవే. కానీ, దేశంలో తొలిసారి మణిపూర్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఏర్పాటైంది. యవోల్‌ అనే స్వచ్ఛంద సంస్థ విద్యార్థులు, ఆటపట్ల ఆసక్తి ఉన్న 14 మంది ట్రాన్స్‌జెండర్లతో ఈ టీమ్‌ను తయారు చేసింది. హోలీ పండుగ సమయంలో సెవెన్‌ ఎ సైడ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌తో ఈ జట్టును అధికారికంగా పరిచయం చేశారు. ‘ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం. కానీ, ఆడటానికి ఎన్నో ఇబ్బందులు, వివక్ష. ఇప్పుడు నా లాంటి వారితో టీమ్‌ను తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆటగాడు చకి హుడ్రోమ్‌ తెలిపాడు. 

Updated Date - 2020-03-31T10:16:49+05:30 IST