Hyderabadలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లోనంటే..
ABN , First Publish Date - 2022-07-03T15:13:53+05:30 IST
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసుల బలగాలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశాయి. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్(Jubleehills Checkpost)
Hyderabad : ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసుల బలగాలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశాయి. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్(Jubleehills Checkpost) – రాజ్ భవన్(Rajbhavan) – పంజాగుట్ట(Punjagutta) – బేగంపేట్ ఎయిర్పోర్టు(Begumpet Airport) – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు. టివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉండనున్నాయి. MG రోడ్, RP రోడ్, SD రోడ్లలో, సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు, రోడ్లలో ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు. పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ఫ్లాట్ ఫారం నంబర్ 10 ద్వారా దారిని మల్లించనున్నారు. ఉప్పల్ వైపు నుంచి నారాయణగూడ, ఆర్టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ప్లేట్ ఫారం నంబర్ 10 నుంచి మల్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులలో ఆంక్షలు ఉంటాయి. ఉప్పల్ వైపు నుంచి పంజాగుట్ట/అమీర్పేట్ వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైలు నిలయం రోడ్ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుంచి లక్డికాపూల్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.