అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2021-09-01T02:50:52+05:30 IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో అపోలో ఆస్పత్రిలో..

అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ నెల 26న అంజన్‌కుమార్‌కు కోవిడ్ వైరస్‌ సోకింది. ఇటీవల మూడుచింతలపల్లి దళిత, గిరిజన దండోరా దీక్షలో అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయనకు జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అంజన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

Updated Date - 2021-09-01T02:50:52+05:30 IST