దళితులను మోసం చేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-10-20T05:04:41+05:30 IST

దళితులను మోసం చేస్తున్నారు..

దళితులను మోసం చేస్తున్నారు..
మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

 బీజేపీ, టీఆర్‌ఎస్‌  దొందూ దొందే..

 టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

కమలాపూర్‌, అక్టోబరు 19: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. కమలాపూర్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత బంధు పథకంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారన్నారు. చివరికి దళితులు నష్టపోతున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌ మాట మార్చుతాడని  అన్నారు. మంత్రి హరీ్‌షరావు హుజూరాబాద్‌కే ఆర్థికశాఖ మంత్రి అయినట్లుగా హుజూరాబాద్‌లో ఏ  అభివృద్ధి కావాలో చేస్తానంటున్నారని, ఇది సరైన ఎన్నికల ప్రక్రియ కాదన్నారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తనపై వచ్చిన ఆరోపణల నుంచి రక్షణ కోసం బీజేపీ పార్టీలో చేరారన్నారు. బీజేపీలో చేరడంతోనే ఈటల ఆరోపణలపై కమిటీ రిపోర్టును ఇవ్వడం లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక ఒప్పందంతోనే పనిచేస్తున్నాయన్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా కేంద్రం నుంచి ప్రత్యేక కమిషన్‌ను పంపించాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై గొంతెత్తి అడిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకటనర్సింగరావును గెలిపించాలన్నారు. 

టీఆర్‌ఎ్‌సతో ఎంపీ సంజయ్‌ ఒప్పందం

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీతో లోపాయికారి ఒప్పందం జరిగిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆరోపించారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉండి బండి సంజయ్‌ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే విషయంలో అంతా స్పష్టత కనిపించడం లేదన్నారు. చాలాచోట్ల బీజేపీ అగ్ర నాయకత్వం రావడం లేదన్నారు, టీఆర్‌ఎస్‌ అవినీతిపై మాటలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు.   ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని   కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు బాల్‌రెడ్డి రాజారెడ్డి, అశోక్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, చరణ్‌పటేల్‌, రవీందర్‌, రమే్‌షగౌడ్‌, వెంకట్‌రెడ్డి, వంశీ, సురేష్‌, కృష్ణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:04:41+05:30 IST