రేవంత్ ఆదేశిస్తే త్వరలో యాక్టివ్: బండ్ల గణేష్

ABN , First Publish Date - 2021-10-15T00:30:52+05:30 IST

షాద్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి..

రేవంత్ ఆదేశిస్తే త్వరలో యాక్టివ్: బండ్ల గణేష్

రంగారెడ్డి: షాద్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో జరిగిన  ఓ ప్రైవేట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మల్లు రవి, నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ యాక్టివ్ కావాలని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ని మల్లు రవి కోరారు. పార్టీ అధ్యకుడు ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని రేవంత్ రెడ్డి‌ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ వ్యాక్యలు చేశారు. రేవంత్ రెడ్డి‌తో బండ్ల గణేష్ మంతనాలు జరుపుతున్నారు. బండ్ల గణేష్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకం కానున్నారు.  

Updated Date - 2021-10-15T00:30:52+05:30 IST