మోదీ, అమిత్ షా కేసీఆర్ చేతిలో ఉన్నారు: Revanth

ABN , First Publish Date - 2022-06-09T19:13:46+05:30 IST

తెలంగాణ ప్రజలు క్రియాశీలక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

మోదీ, అమిత్ షా కేసీఆర్ చేతిలో ఉన్నారు: Revanth

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు క్రియాశీలక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. కానీ రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ... మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సెక్షన్ 8 ప్రకారం జంట నగరాలలో గవర్నర్‌కు సర్వాధీకారాలు ఉన్నాయని తెలిపారు. అవసరం అయితే పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్ షా... ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉన్నారని.. గవర్నర్ చేతిలో లేరు కదా అని అన్నారు. కేసీఆర్‌కు అధికారంతో పాటు బాధ్యత ఉంటుందని.. భాధ్యత తీసుకోనప్పుడు..రాజ్యంగం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు. గవర్నర్ మోదీకి ఏం చెప్పినా.. కేసీఆర్ మాటే మోదీ వింటారన్నారు. ఎంఐఏ, టీఎర్ఎస్ పార్టీలు... అత్యాచార ఘటనలలో కూడా పొత్తుతోనే వెళుతున్నారంటూ రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-06-09T19:13:46+05:30 IST