ఏ వయసు వారికైనా కాంగ్రెస్‌లో సభ్యత్వం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-13T00:23:27+05:30 IST

ఏ వయస్సు ఉన్న వారికైనా కాంగ్రెస్‌లో సభ్యత్వం ఉంటుందని

ఏ వయసు వారికైనా కాంగ్రెస్‌లో సభ్యత్వం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఏ వయస్సు ఉన్న వారికైనా కాంగ్రెస్‌లో సభ్యత్వం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించారు. జనవరి 26 వరకు పూర్తికాకపోతే అదనపు సమయ కోసం ఏఐసీసీని అడుగుతున్నామన్నారు. సమయం తీసుకొని అయినా 30 లక్షల సభ్యత్వాలు పూర్తి చేస్తామన్నారు. 30 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసిన తరువాత గాంధీ భవన్‌లో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.  సభ్యత్వ నమోదుకు గ్రామాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్నారు. పేపర్ ద్వారా చేస్తామని ప్రతిపాదనలు చేస్తున్నారని,  అయితే సాధ్యమైనంత వరకు డిజిటల్ ద్వారానే చేస్తున్నామని ఆయన తెలిపారు. 


కాంగ్రెస్‌ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. దీని పరిమితి కాలం 2022 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు పార్టీ సభ్యత్వం ఉంటుందన్నారు. 30 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటివరకు 7 లక్షల సభ్యత్వాలను నమోదు చేశామన్నారు. సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 34, 765 పోలింగ్ బూతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో బూతులో ఒక్కో ఎన్‌రోలర్‌ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందన్నారు. మండలంలో 15 వేలు, నియోజకవర్గంలో 50 వేలు, పార్లమెంట్ పరిధిలో మూడున్నర లక్షల సభ్యత్వాలు నమోదు చేసిన వారికి రాహుల్ గాంధీ‌తో కల్పించి వారి చేత అభినందనలు  అందజేపిస్తామన్నారు. 

 



కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు లిస్ట్‌ని ముందు పెట్టుకొని  సభ్యత్వ నమోదు ఇస్తున్నామన్నారు. సభ్యత్వ నమోదుకు ఒక ఐడీ కార్డు ఇస్తున్నామని,ఇది వారికి గుర్తింపు కార్డు అని ఆయన తెలిపారు. బూతులో ఉన్న ఎన్‌రోలర్లు తమ పార్టీ సైనికులని ఆయన పేర్కొన్నారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి సోనియాగాంధీ ఇంటి సభ్యులుగా వివరించి చెప్పాలన్నారు. ప్రతి బూతులో 100 మంది సభ్యులు చేరితే 34 లక్షల సభ్యత్వాలు అవుతాయన్నారు. మేమంతా ఎవరికి వారే మా నియోజకవర్గాల్లో డిజిటల్ సభ్యత్వం పైనే ఉన్నామన్నారు.


షబ్బీర్ అలీ తన సొంత బూతులో 400 సభ్యులను చేర్చారన్నారు. వనపర్తిలో చిన్నారెడ్డి సొంత నియోజకవర్గంలో 20 వేల సభ్యత్వాలు పూర్తి చేశారని ఆయన తెలిపారు. మూడు రోజుల క్రితం ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ ప్రవీణ్ చక్రవర్తి మూడు గంటల పాటు జూమ్ మీటింగ్‌లో సభ్యత్వం నమోదుపై సమావేశం నిర్వహించారన్నారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారిని పీసీసి స్వయంగా పిలిచి సన్మానం చేసి అభినందిస్తామన్నారు.

Updated Date - 2022-01-13T00:23:27+05:30 IST