టీపీఏడీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-03-04T05:23:11+05:30 IST

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) 2021 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గం కొలువుతీరింది. ప్రస్కోలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫౌండేషన్ చైర్, కో-చైర్ ప

టీపీఏడీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) 2021 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గం కొలువుతీరింది. ప్రస్కోలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫౌండేషన్ చైర్, కో-చైర్ పర్సన్, కో-ఆర్డినేటర్, ప్రెసిడెంట్‌తో పాటు ఆఫీసు బేరల్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవికాంత్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో టీపీఏడీ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. న్యూయార్క్‌లోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాస్క్‌లు అందించినట్టు చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో  ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు చేసిన కృషిని ప్రశంసించారు. 



అనంతరం టీపీఏడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మధుమతి వైజరాజు మాట్లాడారు. ఫౌండేషన్ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చైర్ పర్సన్ రావు కల్వాలా మాట్లాడుతూ.. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ కొన్నేళ్లుగా బ్లడ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా వందలాది మంది ప్రాణాలు రక్షించినట్టు తెలిపారు. బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్ మాధవి సుంకిరెడ్డి మాట్లాడుతూ.. 2021లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. కోఆర్డినేటర్‌గా ఎన్నికైన గోలీ బుచి రెడ్డి మాట్లాడుతూ.. సంస్థకు గట్టి పునాది వేసినందుకు టీపీఏడీ గత అధ్యక్షులకు ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీనియర్ సభ్యులు ప్రసంగించారు. తక్కవ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ రూపొందింనందుకు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి డీఎఫ్‌డబ్ల్యూ తెలుగు కమ్యూనిటీ తన మద్దతును ప్రకటించింది. 



2021-22 సంవత్సరానికి ఎన్నికైన ఫౌండేషన్ సభ్యులు

రావు కల్వాలా (చైర్, ఫౌండేషన్ కమిటీ), రఘువీర్ బండారు(వైస్ చైర్, ఫౌండేషన్ కమిటీ), మాదవి సుంకిరెడ్డి (చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), ఇంద్రాణి పంచెరువుల (వైస్ చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), బుచి రెడ్డి గోలి( కో-ఆర్డినేటర్), రవికాంత్ మామిడి( ప్రెసిడెంట్), చంద్రరెడ్డి పోలీస్ (పూర్వ అధ్యక్షుడు), రూప కన్నయ్యరి (ఉపాధ్యక్షుడు) అనురాధ మేకల (ప్రధాన కార్యదర్శి), లింగారెడ్డి అల్వా (సంయుక్త కార్యదర్శి), శంకర్ పరిమల్ (కోశాధికారి), మధుమతి వైజరాజు(సంయుక్త-కోశాధికారి), కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మాధవి లోకిరెడ్డి, లక్ష్మ పోరెడ్డి, రత్నవుప్పల, రోజా అదెపు, శ్రీధర్ మేముల, మంజులా తోడినావూరు. ధర్మకర్తలు రామ్ అన్నాడి, అశోక్ కొండల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, పాండురంగ రెడ్డి పాల్వే, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకిరామ్ మందాడి తదితరులు.


Updated Date - 2021-03-04T05:23:11+05:30 IST