పబ్‌లో షాకింగ్ ఘటన.. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో బద్దలైన అద్దం.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ..!

ABN , First Publish Date - 2021-12-13T01:19:13+05:30 IST

దెయ్యాలూ..భూతాలు ఉన్నాయా అన్న చర్చ అంతం లేదు. కొందరు ఉన్నాయంటారు. మరికొందరు అవన్నీ వ్యక్తుల భ్రాంతి మాత్రమేనంటూ కొట్టిపారేస్తారు. అయితే..తరచూ ఎక్కడోచోట భయం గొలిపే ఘటనలు జరుగుతూ దెయ్యాలు, ఆత్మలు కచ్చితంగా ఉన్నాయనే భావన రేకెత్తిస్తుంటాయి. ఇటీవల బ్రిటన్‌లోని ఓ పబ్‌లో

పబ్‌లో షాకింగ్ ఘటన.. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో బద్దలైన అద్దం.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ..!

ఇంటర్నెట్ డెస్క్: దెయ్యాలూ..భూతాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కొందరు ఉన్నాయంటారు. మరికొందరు అవన్నీ వ్యక్తుల భ్రాంతి మాత్రమేనంటూ కొట్టిపారేస్తారు. అయితే..తరచూ ఎక్కడోచోట భయం గొలిపే ఘటనలు జరుగుతూ దెయ్యాలు, ఆత్మలు కచ్చితంగా ఉన్నాయనే భావన రేకెత్తిస్తుంటాయి. ఇటీవల బ్రిటన్‌లోని ఓ పబ్‌లో సరిగ్గా ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ ఉన్నట్టుండి ఓ అద్దం పగిలిపోయి.. ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీనికి కారణమేంటో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టలేదు.  అది అల్మారాకు అమర్చిన అద్దం. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకే దారితీస్తోంది. 


కొందరేమో దెయ్యాలు నిద్రలేచి లొల్లి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. హేతువాదులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. ఆ అద్దం మీద ఏదో పడి ఉండొచ్చనేది వారు లేవనెత్తుతున్న సందేహం. పబ్ యజమాని మాత్రం అలా జరిగే అవకాశమేలేదని చెపుతున్నాడు. అది సాధారణ అద్దం కాదని, దృఢంగా ఉండేలా తయారు చేసిన గిన్నిస్ అద్దమని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. దానిపై మరో వస్తువేదో పడే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. లాంగ్ ఆర్మ్స్ అనే పబ్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ పబ్‌లో ఇటీవలే దెయ్యాలను గుర్తు చేసే ఓ ఘటన జరిగింది. అక్కడి టేబుల్ మీద పెట్టిన ఉన్న ఓ గ్లాస్..దానంతట అదే ఎవరూ తోయకుండానే పడిపోవడంతో అకడున్న వారందరూ ఒక్కసారిగా షాకైపోయారు. దీంతో..అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయా అనే సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-12-13T01:19:13+05:30 IST