భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సెనేటర్లు

ABN , First Publish Date - 2021-08-14T20:52:01+05:30 IST

భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో టాప్ అమెరికన్ సెనేటర్లు జాన్ కార్నిన్ (రిపబ్లికన్ పార్టీ), మార్క్ వార్నర్ (డెమొక్రటిక్ పార్టీ), వ్యోమగామి సునితా విలియమ్స్ భారత ప్రజల

భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సెనేటర్లు

వాషింగ్టన్: భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో టాప్ అమెరికన్ సెనేటర్లు జాన్ కార్నిన్ (రిపబ్లికన్ పార్టీ), మార్క్ వార్నర్ (డెమొక్రటిక్ పార్టీ), వ్యోమగామి సునితా విలియమ్స్ భారత ప్రజలకు అదేవిధంగా ఇండియన్ అమెరికన్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే రెండు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు ప్రస్తుతం చాలా అవసరమని పేర్కొన్నారు. 



‘75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబుతున్న భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్-అమెరికా  ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. వీటి మధ్య ఉన్న బంధాలు బలంగా ఉండటం.. గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం’ అని మార్క్ వార్నర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ వ్యోమగామి సునితా విలియమ్స్ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు చెబతూ.. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాలు చేసుకున్న సహాయ సహకారాలను గుర్తు చేశారు. 


Updated Date - 2021-08-14T20:52:01+05:30 IST