Advertisement
Advertisement
Abn logo
Advertisement

Tollywood Drugs Case : సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్

హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ  ముగిసింది. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ లభించింది. డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై ఈడీ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్‌కు చెందిన 12 మంది నటీనటులను ఈడీ విచారించింది. కాగా... సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేతకు రంగం సిద్ధమైంది. ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌ చిట్‌ లభించింది. 

Advertisement
Advertisement