టోక్యో ఒలింపిక్స్ : ఫైనల్స్‌కు చేరిన పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌

ABN , First Publish Date - 2021-08-04T18:48:40+05:30 IST

పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ టోక్యో ఒలింపింక్స్‌లో

టోక్యో ఒలింపిక్స్ : ఫైనల్స్‌కు చేరిన పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌

టోక్యో : పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ టోక్యో ఒలింపింక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్‌కు క్వాలిఫయింగ్ రౌండ్‌లో గ్రూప్‌-బీలో టాప్‌నకు చేరాడు. 85.16 మీటర్ల త్రో ద్వారా అర్షద్ ఈ స్థానానికి చేరాడు. 


భారత యువ అథ్లెట్ నీరజ్‌ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌-ఏ క్వాలిఫయింగ్ రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. దీంతో జావెలిన్ త్రో విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 


2018 ఆసియన్ గేమ్స్ సందర్భంగా నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ కరచాలనం ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-08-04T18:48:40+05:30 IST