మంగళవారం పోటీల తరువాత ఒలింపిక్స్ టేబుల్ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2021-08-04T05:45:10+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 57 దేశాలు లేదా జాతీయ ఒలింపిక్ కమిటీలు కనీసం ఒక్క గోల్డ్ మెడల్ అయినా సాధించాయి. మెడల్స్ పట్టికలో..

మంగళవారం పోటీల తరువాత ఒలింపిక్స్ టేబుల్ ఎలా ఉందంటే..

టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 57 దేశాలు లేదా జాతీయ ఒలింపిక్ కమిటీలు కనీసం ఒక్కో గోల్డ్ మెడల్ సాధించాయి. మెడల్స్ పట్టికలో ఇప్పటికీ చైనా టాప్‌లోనే కొనసాగుతోంది. 84 దేశాలు కనీసం ఒక్కో పతకమైనా(గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఏదో ఒకటి) గెలిచాయి. 32 బంగారు, 21 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 69 మెడల్స్ సాధించి చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో 24 బంగారు, 28 రజత, 21 కాంస్య పతకాలతో మొత్తం 73 పతకాలు సాధించి అమెరికా నిలిచింది. మూడో స్థానంలో 19 గోల్డ్, 6 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 36 మెడల్స్ సాధించి జపాన్ కొనసాగుతోంది.


ఇక భారత్ విషయానికి వస్తే ఈ ఏడాది ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ గెలుచుకోలేదు. ఆటగాళ్లంగా ఒక్కొక్కరుగా నిరాశ పరుస్తూ ఇంటి దారి పడుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానూ రజతం పతకం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించగా.. ఇటీవల షట్లర్ పీవీ సింధు కాంస్యం గెలిచి దేశానికి రెండో పతకాన్ని తెచ్చిపెట్టింది. ఈ రెండు పతకాలతో భారత్ ప్రస్తుతం 64వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌తో పాటు కెన్యా, కిర్జిజ్‌స్తాన్, నైజీరియా, శాన్ మరీనో, ఉగాండా దేశాలు కూడా తలా ఓ రజతం, ఓ కాంస్యం సాధించి 64 స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 8తో ఒలింపిక్ పోటీలు ముగియనున్నాయి.

Updated Date - 2021-08-04T05:45:10+05:30 IST